స్వచ్ఛ బడులకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ బడులకు ప్రోత్సాహం

Sep 9 2026 11:22 PM | Updated on Sep 9 2026 11:22 PM

● జాతీయస్థాయికి ఎంపికై తే రూ.లక్ష ● ఈ నెల 11వరకు దరఖాస్తు గడువు

లక్ష్మణచాంద: ప్రభుత్వ, ప్రైవేట్‌ బడుల్లో పరిసరాలను మరింత ఆహ్లాదంగా మార్చేందుకు ప చ్చదనం, పరిసరాల పరిశుభ్రతను పెంచేందు కు కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందుకు స్వచ్ఛ ఏవం హరిత్‌ విద్యాలయ రేటింగ్‌ విధానాన్ని అ మల్లోకి తెచ్చింది. నీటి వసతి, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పచ్చదనంతో పాఠశాల ఆవరణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలతోపాటు ప్రైవేట్‌ బడులుండగా రెండేళ్ల క్రితం జిల్లా నుంచి ఎనిమిది రాష్ట్రస్థాయికి వెళ్లాయి. ఇందులో సెయింట్‌ థా మస్‌ పాఠశాల జాతీయస్థాయికి ఎంపికై రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందుకుంది. గతేడాది ఎ నిమిది బడులు రాష్ట్రస్థాయికి వెళ్లాయి. ఈ ఏడా ది ఎలాగైనా జాతీయస్థాయికి వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

నమోదు ఎలా చేసుకోవాలంటే..

ప్రధానోపాధ్యాయులు ఎస్‌హెచ్‌వీఆర్‌ పోర్టల్‌ లేదా స్వచ్ఛ ఏవం హరిత్‌ విద్యాలయ రేటింగ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. యూడైస్‌ ప్లస్‌ కోడ్‌ పాస్‌వర్డ్‌తో లాగినై స్వీయ మూల్యాంకన ఫారంలో వివరాలు నమోదు చే యాలి. పాఠశాలలోని మౌలిక వసతులు, వ్యర్థా ల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్‌ పొదుపు, సౌర శక్తి వినియోగం తదితర అంశాల చిత్రాలను సంబంధిత ఫోర్టల్‌లో అప్‌లోడ్‌ చే యాలి. అప్‌లోడ్‌ చేసిన అంశాలను పరిశీలించి వాటి ఆధారంగా గ్రేడ్‌ కేటాయిస్తారు. 5 స్టార్‌ రేటింగ్‌ సాధించిన ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. అక్కడి నుంచి జాతీయ స్థా యికి ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలకు రూ.లక్ష ప్రోత్సాహకం ఇస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి

ఈ నెల 11లోపు స్వచ్ఛ ఏవం హరిత్‌ విద్యాలయ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు ఇంకా రిజిస్ట్రేషన్‌ చేసుకోని పాఠశాలలు వెంటనే చేసుకోవాలి. ఇందులో ఉత్తమ రేటింగ్‌ వచ్చిన పాఠశాలలను రాష్ట్ర స్థాయికి పంపుతాం. అక్కడ మంచి రేటింగ్‌ వచ్చి జాతీయ స్థాయికి ఎంపికై తే కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని పాఠశాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. – భోజన్న, జిల్లా విద్యాధికారి

జిల్లాలోని మొత్తం స్కూళ్లు 1,062

రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నవి 755

వివరాలు అప్‌లోడ్‌ చేసినవి 488

రిజిస్ట్రేషన్‌ ప్రారంభించనవి 307

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement