నిర్మల్‌టౌన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి పోరిక రవీందర్ బుధవారం జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. సేవలు, సౌకర్యాలు పరిశీలించి సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు సకాలంలో సహాయం అందించి వారి వివరాలు గోప్యంగా ఉంచాలని సూచించారు. అనంతరం బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి బాలల సంరక్షణ, భద్రత, హక్కు ల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకున్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.భవిష్య, భరోసా కేంద్రం ఎస్సై సుమాంజలి, సిబ్బంది పాల్గొన్నారు.


