నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు

Sep 9 2026 11:22 PM | Updated on Sep 9 2026 11:22 PM

● నేర సమీక్షలో ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్‌టౌన్‌: నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు, పోలీ స్‌స్టేషన్ల పనితీరుపై సమీక్షించారు. అనంతరం మా ట్లాడుతూ.. కేసుల నమోదు, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. రాత్రి గస్తీ పటిష్టం చేయాలని, అవసరమైన చోట సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలను వినియోగించాలని ఆదేశించారు. సైబర్‌ మోసాలకు గురి కాకుండా ఉండేందుకు ప్రజ లకు అవగాహన కల్పించాలని సూచించారు. గణేశ్‌ మండపాల సమాచారాన్ని తెలంగాణ పోలీస్‌ అధి కారిక పోర్టల్‌లో ముందుగానే నమోదు చేసుకోవా లని సూచించారు. తద్వారా బందోబస్తు, ట్రా ఫిక్‌ నియంత్రణ, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని కోరారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఏవో యూనస్‌ అలీ, ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, ప్రవీ ణ్‌కుమార్‌, కృష్ణ, రవీందర్‌నాయక్‌, సమ్మయ్య, సాయికుమార్‌, దీపక్‌, ఆర్‌ఐలు రామ్‌నిరంజన్‌, శేఖర్‌, ఎస్‌హెచ్‌వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

వినతులు విని.. పరిష్కారానికి ఆదేశించి..

భైంసాటౌన్‌: పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. భైంసా సబ్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ జానకీ షర్మిల వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. కుటుంబ సమస్యల పరిష్కారానికి షీటీం బృందం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గత గ్రీవెన్స్‌ డేల్లో అందిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని సమీక్షించారు. ఏఎస్పీ సాయికిరణ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement