ఖానాపూర్: జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు మాదకద్రవ్యాల ని వారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించా రు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, నశా ముక్త్ భారత్ అభియాన్ మార్గదర్శకాలకు అనుగుణంగా డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శన ద్వారా విద్యార్థులకు డ్రగ్స్‌తో కలిగే అనర్ధాలను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల జిల్లా నార్కోటిక్ విభాగం ఇన్‌చార్జి రాజశేఖర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపారు. మెదడు పనితీరు, ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి క్షీణించి విద్యార్థుల భవిష్య త్ నాశనమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. డ్రగ్స్‌కు బానిసైతే కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల కొనుగోలు, విక్రయం, రవాణా, నిల్వ, విని యోగం చట్టరీత్యా తీవ్రమైన నేరాలని తెలిపారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా యాంటీ డ్రగ్ టోల్‌ఫ్రీ నంబర్ 1908కు సమాచారం ఇవ్వాలని కోరారు. హెచ్‌ఎం నరేందర్, ఉపాధ్యాయులు అంజయ్య, షేక్ ఇమ్రాన్ తదితరులున్నారు.


