వేతనాలు పెంచాలని రోడ్డెక్కిన ఆశ వర్కర్లు | - | Sakshi
Sakshi News home page

వేతనాలు పెంచాలని రోడ్డెక్కిన ఆశ వర్కర్లు

Sep 9 2026 11:22 PM | Updated on Sep 9 2026 11:22 PM

నిర్మల్‌చైన్‌గేట్‌: తమకు రూ.18వేల గౌరవ వేతనం ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం ఆశ వర్కర్లు రాస్తారోకో చేశారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఇ న్సూరెన్స్‌ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జి ల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్‌ మాట్లాడారు. గ్రామీ ణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కు ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రభుత్వ వైద్య రంగా నికి ఆశ వర్కర్లు వెన్నెముకగా నిలుస్తున్నా వారి శ్ర మకు తగిన వేతనం అందడంలేదని తెలిపారు. వా రు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పే ర్కొన్నారు. డిమాండ్లు నెరవేర్చకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ‘చలో అసెంబ్లీ’కి బయలుదేరిన ఆశ వర్కర్లను ముందస్తుగా అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వెంటనే వారిని విడుదల చే యాలని డిమాండ్‌ చేశారు. ఆశ వర్కర్స్‌ యూనియ న్‌ డివిజన్‌ అధ్యక్షురాలు సుగుణ, కార్యదర్శి లక్ష్మి, నాయకులు రామలక్ష్మి, భాగ్య, సంగీత ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement