ఖానాపూర్ : నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జన్, ఫిజీషియన్, ఆర్థోపెడిక్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రమాద బాధితులు, క్లిష్టమైన కేసులను నిర్మల్‌కు రిఫర్ చేయాల్సి వస్తోంది. 50 పడకల ఆస్పత్రిని 100 పడకలకు పెంచుతామన్న హామీ అమలు కాలేదు. ఖాళీ పోస్టులు భర్తీ చేసి, ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రయత్నిస్తున్నారు.


