నిర్మల్‌టౌన్: ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పోరిక రవీందర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్‌తో సోమవారం సమావేశం నిర్వహించారు. లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించి, పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులను గుర్తించి ఇరుపక్షాల సమన్వయంతో పరిష్కారం జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఇందులో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఏ.రాజలింగం పాల్గొన్నారు.


