● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్: ఎస్‌ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నోటీసుల ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఈవో సుదర్శన్‌రెడ్డి సోమవారం కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా పూర్తి చేసిన నోటీసుల జారీ, ఇంకా పెండింగ్ ఉన్న నోటీసులు, హియరింగ్ నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియ మొత్తం గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ భవేశ్‌మిశ్రా పాల్గొన్నారు. జిల్లాలో సర్ నోటీసులు, హియరింగ్ ప్రక్రియను ఉన్నతాధికారులకు వివరించారు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీఆర్‌వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్ పాల్గొన్నారు.


