సమస్యల ఏకరువు | - | Sakshi
Sakshi News home page

సమస్యల ఏకరువు

Sep 8 2026 12:47 AM | Updated on Sep 8 2026 12:47 AM

● ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ ● భూ సమస్యలపైనే ఎక్కువ.. ● పరిష్కారంలో అధికారుల అలసత్వం ● కలెక్టర్‌ హెచ్చరించినా మారని తీరు

నిర్మల్‌చైన్‌గేట్‌: సమీకృత కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చి.. ఉన్నతాధికారులతో తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. ప్రజావాణిలో పరిష్కారం చూపెడతారనే ఆశతో వ్యయ, ప్రయాసాలకోర్చి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ఆదేశాల మేరకు తహసీల్దార్‌ కార్యాలయాల్లో సైతం ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్నప్పటికీ అనేక ఫిర్యాదులు టేబుళ్లకే పరిమితమవుతున్నా యి. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్‌ హెచ్చరిస్తున్నా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. కాగా, సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 130 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్‌ భవిశ్‌మిశ్రా, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. డీఆర్వో రమేశ్‌రాథోడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement