● ఆరు దశల కార్యాచరణతో ప్రణాళిక.. ● డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్‌టౌన్: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ.ఆనంద్ పోలీసు అధికా రులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాల బందో బస్తు ఏర్పాట్లపై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచనలు చేశారు. ఎస్పీ జానకీ షర్మిల, డీఎస్పీ శ్రీనివాస్ వీసీలో పాల్గొన్నారు. గణేశ్‌విగ్రహాల ప్రతిష్టాపన, ఊరేగింపులు, నిమజ్జన రూట్లు, సున్నిత ప్రాంతాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ మ్యాపింగ్, ముందస్తు సమాచార సేకరణ తదితర అంశాలపై డీజీపీ దిశానిర్దేశం చేశారు. ఆరు దశల కార్యాచరణను అమలు చేయాలని సూచించా రు. నిమజ్జన రూట్లు, ప్రాంతాలు, ట్రాఫిక్ మళ్లింపులు, బందోబస్తు ఏర్పాట్లపై ముందుగానే ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. మూడో రోజు నుంచి పదో రోజు వరకు జరిగే నిమజ్జనాలకు దశలవారీగా భద్రత కల్పించా లని ఆదేశించారు. సెప్టెంబర్ 25న తుది నిమజ్జనం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని సూచించారు. జిల్లాలో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్పీ జానకీషర్మిల


