కుభీర్: నీటి గుంతలో స్నానానికి దిగి ఈతరాక ఒకరు మునిగి మృతిచెందినట్లు ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపారు. ఎస్సై, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పార్డి(బి) గ్రామానికి చెందిన గుడాల సాయినాథ్ (48), గ్రామస్తులు శ్రావణ శనివారం రాజరాజేశ్వరం మందిరంలో విగ్రహాలను పల్లకీలో ఉంచి బ్రహ్మేశ్వర్‌లో బ్రహ్మేశ్వర్ మందిర్‌కు తీసుకెళ్లారు. అక్కడి నీటి గుంతలో స్నానాలు, పూజల అనంతరం గ్రామస్తులు బయల్దేరారు. అక్కడే ఉన్న సాయినాథ్ నీటిగుంతలో స్నానానికి దిగి ఈత రాక మునిగాడు. ఆయన రాలేదని కొందరు అక్కడికి వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడు. భార్య విజయ ఫిర్యాదుతో కేసు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


