ఖానాపూర్: మండలంలోని రాజురాలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామపంచాయతీ వినూత్న చర్యలు చేపట్టింది. సర్పంచ్ చేగంటి మల్లేశ్ ఆధ్వర్యంలో 500 స్టీల్ ప్లేట్లను కొనుగోలు చేశారు. ప్రతీ శుభకార్యంలో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను వినియోగిస్తున్నారు. మరిన్ని ప్లేట్లను తీసుకొస్తామని సర్పంచ్ తెలిపారు. సింగాపూర్‌లో మూడేళ్లుగా ప్లాస్టిక్‌పై పోరు కొనసాగిస్తున్నారు. స్టీల్‌బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు. సుర్జాపూర్‌లో ఎంపీడీవో రాధారాథోడ్ చొరవతో సర్పంచ్ వెంకటరాములు పంచాయతీ నిధులతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు.


