నిర్మల్‌చైన్‌గేట్: టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 10న తలపెట్టన ‘చలో హైదరాబాద్’ పోస్టర్‌ను శనివారం నాయకులు ఆవిష్కరించారు. టీజీఈజేఏసీ చైర్మన్ వెల్మల ప్రభాకర్, సెక్రెటరీ జనరల్ పీజీ.రెడ్డి మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్’కు అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావా లని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కుడాల రవికుమార్, టీజీవో జిల్లా కార్యదర్శి రమేశ్, క్లాస్–4 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.రవి, సెక్రెటరీ గణేశ్, నాయకులు వెంకటరమణ, సజన్, సంతోష్, మురళీకృష్ణ, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.


