వైభవంగా మురళీకృషుడి శోభాయాత్ర | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మురళీకృషుడి శోభాయాత్ర

Sep 6 2026 1:31 AM | Updated on Sep 6 2026 1:31 AM

కుంటాల: మండల కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం ముగిశాయి. కుంటాలలోని ప్రాచీన శ్రీకృష్ణ దేశాలయంలో రాఖీ పౌర్ణమి నుంచి వారం రోజులు వేడుకలు జరుగుతా యి. శనివారం వేకువ జామున హనుమాన్‌ ఆలయంలో కాకడహారతితో వేడుకలు ముగిశా యి. ఎస్పీ జానకీషర్మిల శ్రీకృష్ణ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. పాత బస్టాండ్‌ ప్రాంతంలో జుట్టు పరివారం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమంలో దౌనెల్లి తండాకు చెందిన చవాన్‌ సంజీవ్‌ టీం సభ్యులు ఉట్టి పోటీలో తలపడగా, భైంసా ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్‌ రూ.11,111 నగదును అందజేశారు. ఉపాధ్యాయుడు మానాజీగారి సునీత–సిద్ధిరాం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జక్కుల గజేందర్‌, భైంసా రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైనరేశ్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ జుట్టు అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గజ్జారాం, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జుట్టు లక్ష్మణ్‌, ఉప సర్పంచ్‌ పరికిపండ్ల వెంకటరమణ, మాజీ ఎంపీపీ గజ్జారాం, మహేందర్‌, నాలం శ్రీనివాస్‌, రమణారావు పాల్గొన్నారు.

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలోని ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి శనివారం వినతిపత్రం సమర్పించారు. యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇంద్రమల మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రతతోపాటు పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం సేవలందిస్తున్న ఆశ వర్కర్లకు సరైన వేతనం లేకపోవడం బాధాకరమన్నారు. సమస్యల సాధనకు సెప్టెంబర్‌ 8న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాకు ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement