నిర్మల్‌రూరల్: ఉపాధ్యాయులు సమ సమాజ నిర్మాతలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశా రు. అనంతరం మాట్లాడుతూ తాను జిల్లాకు వచ్చి న కొత్తలో కొన్ని పాఠశాలలు తనిఖీ చేసి, విద్యార్థు ల నైపుణ్యాన్ని పరీక్షించానని.. కొన్ని పాఠశాలల విద్యార్థుల నైపుణ్యం పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సన్మార్గంలో నడిచేలా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ ఏడాది విద్యార్థుల నమోదు పెరగడం పరీక్ష ఫలితాల్లో మంచి పురోగతి సాధించడం అభినందనీయమన్నారు. జిల్లా ఉపా ధ్యాయులు రాష్ట్ర, జాతీయ అవార్డులకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. డీఈవో భోజన్న, డీఆర్వో రమేశ్‌రాథోడ్, డీఐఈవో పరుశురాం, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్, దయానంద్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ పాల్గొన్నారు.


