కడెం: మండలంలోని ఎలగడప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూచనపెల్లి శ్రీనివాస్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవా ర్డు ఎంపికయ్యారు. కొడంగల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, టీచర్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నారు.
ఆర్జీయూకేటీ అధ్యాపకుడికి ఉత్తమ అవార్డు
బాసర: బాసర ఆర్జీయూకేటీలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో సేవలందిస్తున్న డాక్టర్ కే.మహేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్నారు. కొడంగల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో యోగితా రాణా, ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఓఎస్‌డీ, ఏవో ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్ అభినందించారు.
అవార్డు అందుకుంటున్న శ్రీనివాస్
రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంటున్న మహేశ్


