నిర్మల్‌టౌన్: ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు వీలైనన్ని ఎక్కువ పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా జడ్జి శ్రీవాణి సూచించారు. ఎస్పీ జానకీషర్మిలతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టులో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అర్హత కలిగిన క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు అధిక సంఖ్యలో పరిష్కరించేలా పోలీస్, న్యాయశాఖ అధికారులు సమన్వయంలో పనిచేయాలని తెలిపారు. పెండింగ్ కేసులను గుర్తించడం, సంబంధిత కక్షిదారులతో సమన్వయం చేయడం, కేసుల పరిష్కారం వేగవంతం చేయడంపై చర్చించారు. ఆన్‌లైన్ పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించి కేసుల వివరాలు సకాలంలో నమోదు, అప్‌డేట్ చేయడం ద్వారా కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ..ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పోలీసు, ప్రాసిక్యూషన్, న్యాయస్థానాల సమన్వయం కీలకమన్నారు. అధికారులు నాణ్యమైన దర్యా ప్తు చేపట్టి, కోర్టు ఆదేశాల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జడ్జి పి.రవీందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవేందర్, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, సీడీవోలు, న్యాయస్థాన అధికారులు పాల్గొన్నారు.


