నిర్మల్‌చైన్‌గేట్: అఖిల భారత రైతు కూలీ సంఘం 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌ఆర్.ఉపాలి కోరారు. జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. పంటలకు గిట్టుబాటు ధర లేక.. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కురుకుపోతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు. సమస్యల పరి ష్కారానికి పోరాటాలే మార్గమన్నారు. సభకు అధిక సంఖ్యలో రైతు కూలీలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా సహాయ కార్యదర్శి గోగు శేఖర్, జిల్లా నాయకులు జె.రాజు, గూట్ల ప్రసాద్, నేతావత్ రవి, గంగాధర్ పాల్గొన్నారు.


