ఖానాపూర్: ఎస్‌జీఎఫ్ అండర్–17 జిల్లాస్థా యి టేబుల్ టెన్నిస్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన బాలబాలికలు జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల క్రీడా కన్వీనర్, హెచ్‌ఎం జాడి శ్రీనివాస్, పీడీ ఇమ్రాన్ తెలిపారు. బాలికల విభాగంలో జి.హిందూ హాసిత, జి.సాయి ప్రసన్న, పి.రచిత, జె.అనన్య(పెంబి జిల్లా పరిషత్ పాఠశాల), ఎం.అలియా, సీహెచ్.అర్చన, బి.లక్ష్మీప్రసన్న(జిల్లా పరిషత్ మస్కాపూర్ పాఠశాల) ఎంపికయ్యారు. బాలుర విభాగంలో కె.యశస్విరాజ్, మస్కాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన పి.కార్తీక్, డి.మనుతేజ్, డి.యోగేశ్వర్, బి.రాఘవ కృష్ణ(నిర్మల్ విన్నర్స్ పాఠశాల), జి.నవదీప్, కె.సాత్విక్(పెంబి జిల్లా పరిషత్ పాఠశాల) ఎంపికయ్యారని వివరించారు. క్రీడాకారులు జోనల్‌స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.


