ముధోల్: రైతులు భూగర్భజలాలు పెంచుకునేందుకు పంటల వద్ద నీటికుంటలు(ఫారంపాండ్లు) తవ్వుకునేందుకు ముందుకు రావాలని డీఆర్డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారంమండలంలోని ముధోల్ గ్రామపంచాయతీ పరిధిలో వీ–బీజీ–రామ్ జీ పథకం ద్వారా నీటి కుంటల ని ర్మాణ పనులను డీఆర్‌డీవో పరిశీలించారు. ఈసందర్భంగా పనుల పురోగతి, నాణ్యత పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లవకుమార్, ఏపీవో శిరీష, ఏపీఎం గురుచరణ్, టెక్నికల్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.


