నర్సాపూర్(జి): ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గొల్లమాడ గ్రామంలో బీరప్ప ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. గ్రామస్తుల విరాళం రూ.ఐదు లక్షలు, సీజీఎఫ్ నిధులు రూ.20 లక్షలతో ఆలయం నిర్మించనున్నారు. ఈసందర్భంగా కు రుమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు గొంగడి, గొర్రె పిల్ల బహూకరించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్న వసంత లస్మయ్య, ఎంపీడీవో పుష్పలత, చెన్న మహేశ్, బాషెట్టి విజయ్ కుమార్, కాంట్రాక్టర్లు కొరివిపాటి కాశీం, వినోద్‌రెడ్డి, కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.


