ముధోల్: ఉద్యానశాఖ రాయితీపై అందించే ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి బి.వి.రమణ పేర్కొన్నారు. మండలంలోని విట్టోలి, తరోడా గ్రామాల్లో పసుపు పంట, ఆయిల్‌పాం తోటలు, బిందు సేద్యం పరికరాలు పరిశీలించారు. ఆధునిక సాగు పద్ధతులు, బిందు సేద్యం ద్వారా నీటిని వినియోగించుకునే తీరును రైతులకు వివరించారు. డివిజన్ ఉద్యాన అధికారి జావిద్ పాషా, ఉద్యాన విస్తరణ అధికారి మోహిని మియా, ఆయిల్‌పామ్ ఏరియా మేనేజర్ ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.


