నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న ఎస్సీ కార్పొరేషన్ షా పింగ్ కాంప్లెక్స్‌లోని 04, 05, 10 నంబర్ దు కాణాలు అద్దెకు ఇచ్చేందుకు నిర్వహించే వే లం గడువు తేదీని పొడిగించినట్లు ఎస్సీ కా ర్పొరేషన్ జిల్లా అధికారి శంకర్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11:30 వరకు వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ అ భ్యర్థులు కుల, ఆదాయ, రేషన్ కార్డ్, ఆధార్ పత్రాలతోపాటు రూ.1,000 డీడీ, రూ.50 వేల ఈఎండీ జతచేసి దరఖాస్తులు ఈనెల 7వ తేదీ వరకు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందించాలని సూచించారు.
నేడు పోలీస్ ప్రజావాణి
భైంసారూరల్: భైంసాలోని ఎస్పీ క్యాంప్ కా ర్యాలయంలో బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్పీ జానకీ షర్మిల అందుబాటులో ఉండనున్నా రు. భైంసా సబ్ డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలు విన్నవించవచ్చన్నారు. అవసరమై న పత్రాలతో వచ్చి ఈ అవకాశం సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు.
ఎంపీడీవోగా భూమన్‌రావ్
కుభీర్: కుభీర్ ఎంపీడీవో గా ఓలెం భూమన్‌రా వు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇ క్కడ ఎంపీడీవోగా పని చేసే ఎ.శ్రీనివాస్ బది లీపై జగిత్యాల వెళ్లగా.. సూపరింటెండెంట్ భూ మన్‌రావుకు బాధ్యతలు అప్పగించారు.
యువకుడి అదృశ్యం
ముధోల్: ముధోల్‌లోని కోలీగల్లీకి చెందిన సప్పటోళ్ల విజయ్ (27) అనే యువకుడు సో మవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రా లేదు. కుటుంబసభ్యులు.. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. మంగళవారం విజ య్ తండ్రి సాయిలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. యువకుడి సమాచారం తెలిస్తే 87126 59539 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
తాతమ్మ ఆలయంలో చోరీ
ఖానాపూర్: పట్టణంలోని గోదావరి తీరంలో ఉన్న తాతమ్మ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ, ఇతర వస్తువులను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై శాలివాహన సంఘ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఓట్లు గల్లంతు కానీయొద్దు
సారంగపూర్: ‘సర్’లో భాగంగా అర్హుల ఓట్లు గల్లంతవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు అన్నారు. మండలంలోని బీరవెల్లి, వంజర్, ప్యారమూర్, తదితర గ్రామాల్లో జరిగిన ‘సర్’గ్రామసభలకు ఆయన హాజరై మాట్లాడారు. పంచాయతీల్లో ప్రదర్శించిన ఓటరు జాబితాలో ఓటర్ల పేర్లు, వివరాలు తప్పుగా నమోదైనా, ఇతర సమస్యలున్నా ఆధారాలతో అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని ప్రజలకు సూ చించారు. బీఎల్‌వోలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సర్పంచులు, ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ, కార్యకర్తలు, నాయకులు తదితరులు ఉన్నారు.
తాళ సప్తాహం ప్రారంభం
తానూరు: మండలకేంద్రంలోని విఠలేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం తాళసప్తాహం ప్రారంభించారు. అర్చకులు పింటు మహరాజ్ పూజలు చేశారు. ఆలయ ఆవరణలో వారంరోజుల పాటు తాళసప్తాహం సాగుతుందని.. రోజు రాత్రి భజనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు.
లింగాకర్షక బుట్టలతో పురుగు నివారణ
లక్ష్మణచాంద: పంట చేనులో పురుగు ఉధృతిని నివారించేందుకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ సూచించారు. మంగళవారం సోన్ మండలంలోని సోన్, గంజాల్ గ్రామాల్లో పంటలను ఆయన పరిశీలించారు. ఈ బుట్టల ఏర్పాటుతో చీడపీడల ఉనికిని ముందుగానే గుర్తించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో వినోద్‌కుమార్, రైతులు ముత్యం, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


