నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

● సరిహద్దులో డేంజర్‌ జర్నీ ● గుంతల రోడ్లు.. ఫిట్‌‘లెస్‌’ వాహనాలు ● మహారాష్ట్ర దారిలో తరచూ ప్రమాదాలు ● బస్సులు లేక.. పాత జీపులే దిక్కు 8లోu బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

కన్నీరు పెట్టిన పార్డి(బి)

మహారాష్ట్రలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన పార్డి(బి) గ్రామానికి చెందిన నలుగురి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు.

బాధ్యతలు స్వీకరణ

నిర్మల్‌టౌన్‌: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శిగా నూతనంగా నియమితులైన పి.రవీందర్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్జి శ్రీవాణి ఆయనను సన్మానించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే న్యాయ సేవలు, ఉచిత న్యాయ సహాయం తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నూతన కార్యదర్శికి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అభినందనలు తెలిపారు.

భైంసా: ఒకవైపు మోకాళ్ల లోతు గుంతలు, మరోవైపు కాలం చెల్లిన వాహనాలు. గత్యంతరం లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న సరిహద్దు గ్రామాల ప్రజలు. రోడ్డు బాగాలేదని తెలుసు, వాహనం ఫిట్‌నెస్‌ లేదని తెలుసు. అయినా ప్రయాణించక తప్పని పరిస్థితి. మహారాష్ట్రను ఆనుకుని ఉన్న ఉమ్మడి జిల్లా గ్రామాల్లో ఇదే దుస్థితి. సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం అత్యవసరం కాగా, వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఏళ్లుగా గుంతలు పూడ్చకపోవడంతో రహదారులపై జర్నీ డేంజర్‌గా మారింది.

సుంక్లి ఘటన కూడా..

గతంలో భైంసా మండలం సుంక్లి గ్రామానికి చెంది న అయ్యప్ప మాలధారులు మహారాష్ట్రలోని మహోర్‌కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇదే తరహా రహదా రిపై ప్రమాదానికి గురయ్యారు. ఆ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఘటన జరిగిన తర్వాత కొంతకాలం అధికారులు స్పందించి గుంతలు పూడుస్తామని, వాహన తనిఖీలు చేస్తామని చెబుతారు. కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. ఫలితంగా ప్రమాదాలు ఆగడం లేదు.

ఎందుకింత నిర్లక్ష్యం?

మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రాంతంలో రవాణా మౌలిక వసతులు కీలకం. సరిహద్దు గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం, రహదారులను అభివృద్ధి చేయడం, ప్రజా రవాణాను పెంచడం అత్యవసరం. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి కారిడార్‌ నిధులు అందుబాటులోకి తీసుకువచ్చి ఉపయోగించాలని స్థానికులు కోరుతున్నారు. సరిహద్దుకు ఇరువైపులా సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో రహదారులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

బస్సులు నడిపితే..

సరిహద్దు గ్రామాలకు సరిపడా ఆర్టీసీ బస్సులు నడిపితే పాత జీపులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. టార్గెట్‌ రావడం లేదన్న కారణంతో గ్రామీణ, సరి హద్దు రూట్లలో బస్సులు నడపడం లేదు. సరిహద్దుకు సమీపంలోని మండల కేంద్రాల్లో బస్సులు అందుబాటులో ఉంచి, అక్కడి నుంచి సమీప గ్రామాలకు రెగ్యులర్‌ సర్వీసులు నడిపితే ప్రజలకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

రేపు జిల్లాస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు

ఖానాపూర్‌: మండలంలోని మస్కాపూర్‌ పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో గురువారం అండర్‌–17 బాలబాలికల టేబుల్‌ టెన్నిస్‌ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు క్రీడా కన్వీనర్‌, హెచ్‌ఎం జాడి శ్రీనివాస్‌, వ్యాయామ ఉపాధ్యాయులు షేక్‌ ఇమ్రాన్‌ తెలిపారు. డీఈవో భోజన్న, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రాఠోడ్‌ లక్ష్మణ్‌ ఆదేశాల మేరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్‌, జనన ధ్రువపత్రం, గతేడాది ప్రోగ్రెస్‌ కార్డు, ఆధార్‌ జిరాక్స్‌ ప్రతులతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ప్రతీ పాఠశాల నుంచి బాలబాలికలు ముగ్గురు చొప్పున పాల్గొనాలని తెలిపారు. వివరాలకు 9963168632 నంబరులో సంప్రదించాలని సూచించారు.

ప్రైవేటు వాహనాలే దిక్కు

అడుగుకో గుంత, మరో అడుగులో కుదుపు అన్నట్టుగా రహదారులపై ఆటోలు నడపడం కష్టంగా మారింది. ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లకపోతే అదుపు తప్పే ప్రమాదం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు సైతం గ్రామాలకు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం మరో పెద్ద సమస్య. బస్సులు లేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఇప్పటికీ జీపుల వినియోగం కొనసాగుతోంది. ఫిట్‌నెస్‌ పరిస్థితి ఎలా ఉన్నా సీట్లకు మించి ప్రయాణికులను ఎక్కించుకుని దూర ప్రయాణాలకు తీసుకెళ్తున్నారు. అధ్వాన రోడ్లపై పాత వాహనాల జర్నీ డెత్‌ బెల్స్‌ మోగిస్తోంది. అయినా రవాణా అధికారులు ఫిట్‌నెస్‌ లేని వాహనాలపై సక్రమ చర్యలు తీసుకోవడం లేదు.

ముగిసిన గణిత విజ్ఞాన మేళా

చదవడం, రాయడం

నేర్పించాలి

తానూరు: విద్యార్థులకు చదడం రాయడం నేర్పించాలని డీఈవో భోజన్న సూచించారు. మండల కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు గణితంలో ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. రికార్డులను పరిశీలించి విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్‌ తీసుకోవాలన్నారు. మోను ప్రకారం భోజనం అందించాలన్నారు. ఆయన వెంట ఎంఈవో నరేందర్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement