సాక్షి: ఇప్పటి వరకు నెరవేర్చిన హామీలు ఏమిటి?
భైంసా: ‘చదువుల తల్లి కొలువైన సరస్వతీ అ మ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం రూ.270 కోట్లు మంజూరు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ముధోల్ ఎమ్మెల్యేగా నా హయాంలో అమ్మవారి గుడి నిర్మాణం జరుగ డం నా పూర్వజన్మ పుణ్యంగా భావిస్తున్నా’ అని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటే ల్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 1000 రోజులు పూర్తయిన సందర్భంలో ‘సాక్షి’తో మాట్లాడారు.
సాక్షి: ముధోల్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చిన హామిలేంటి?
ఎమ్మెల్యే: నియోజకవర్గం సరిహద్దులో ఉంది. ఇక్కడ నిరుపేదలే ఎక్కువ. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చాను. ఎన్నిక ల సమయంలోనే సిరాల ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని, నిరుపేదలకు ఇళ్లు, రైతులకు కరెంటు ఇబ్బందులు తీరుస్తామని చెప్పాం.
సాక్షి: ఇంకా నెరవేర్చాల్సినవి ఏమున్నాయి?
ఎమ్మెల్యే: నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూ ల్ పనులు ప్రారంభం కానున్నాయి. రూ.200 కోట్ల తో నిర్మాణం జరుగనుంది. బాసరలో కేంద్రియ విద్యాలయానికి సంబంధించిన ప్రతిపాదనలు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రారంభం అవుతుంది.
సాక్షి: నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉంది?
ఎమ్మెల్యే: ముధోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పూర్తిస్థాయిలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. అసెంబ్లీలో ఇక్కడి సమస్యలు ప్రస్తావిస్తూ మంత్రులను కలిసి నా నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయిస్తున్నాను. అన్నివర్గాల అభివృద్ధి జరుగుతోంది. రైతుల కోసం మూడు సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తయ్యింది. మరిన్ని సబ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రతీ గ్రామంలో పంచాయతీ భవనాలు, వీవో భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి.
సాక్షి: నియోజవకర్గ ప్రజలకు మీరిచ్చే భరోసా ఏమిటి ?
ఎమ్మెల్యే: ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటా. కాళేశ్వరం నీళ్లు ముధోల్ నియోజకవర్గ సాగు భూములకు అందించాలన్నదే నా సంకల్పం. ఎలాంటి వివక్షలేకుండా ముధోల్ నియోజకవర్గ ప్రజలందరికీ సేవలు చేస్తా. ప్రజాసేవకే కట్టుబడి ఉంటా. ఎక్కడ ఉన్నా నియోజకవర్గ ప్రజల బాగు కోసమే కృషి చేస్తున్నా. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తా. కేంద్రంతో మాట్లాడి బాసర – మహోర్ హైవే నిర్మాణం చేయిస్తా.
ఎమ్మెల్యే: భైంసా ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభించాం. బాసరలో పీహెచ్‌సీ పనులు ప్రారంభమయ్యా యి. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాం. రూ.270 కోట్ల తో బాసర ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఎంతో మంది నిరుపేదలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందితే సీఎం రిలీఫ్ ఫండ్‌కు సహాయం అందేలా చూశాం. పిప్రి ఎత్తిపోతల పథకం ప్రారంభించాం. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయి. త్వరలోనే రూ.15 కోట్లతో భైంసా పట్టణ అభివృద్ధి చేపడతాం. వందల కోట్లు వెచ్చించి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం చేపట్టాం.


