కడెం: మండలంలోని ఎలగడప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు డు కూచనపెల్లి శ్రీని వాస్ రాష్ట్రస్థాయి ఉత్త మ ఉపాధ్యాయుడి అ వార్డుకు ఎంపికయ్యా రు. రెండేళ్ల క్రితం మండలంలోని లింగాపూర్ పాఠశాల నుంచి బదిలీపై ఎలగడపకు వచ్చిన శ్రీనివాస్ విద్యార్థుల ప్రవేశాలు పెంపొందించి, మూతబడే పాఠశాలను బతికించారు. పాఠశాల గదులకు కిటికీలకు తలుపులు లేక కోతులు తరగతి గదిలోకి వస్తుండడంతో వడ్రంగి కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్ కులవృత్తిలో తనకున్న అనుభవనంతోఆరు కిటికీలకు తలుపులు తయారు చేశాడు. లింగాపూర్ పాఠశాలలో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించారు. పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్థులను తానే బైక్‌పై ఇంటికి వెళ్లి తీసుకెళ్లేవారు. ఉపాధ్యాయుడిగానే కా కుండా కళాకారుడిగా పలు పౌరాణిక నాటకా లు ప్రదర్శిస్తూ రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి ఆవార్డుకు ఎంపికవడం సంతోషంగా ఉందని శ్రీనివాస్ తెలి పారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాలు అవార్డు రావడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.


