నిర్మల్‌టౌన్: జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా దండేకర్‌సాయి(కానిస్టేబుల్), ఉపాధ్యక్షులుగా కృష్ణ (ఇన్‌స్పెక్టర్), సాయికృష్ణ (ఆర్‌ఎస్సై), కార్యదర్శిగా శ్రీకాంత్ (ఎస్సై), ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రామ్‌నిరంజన్(ఆర్‌ఐ), జాయింట్ సెక్రెటరీగా సంతోష్(కానిస్టేబుల్), కోశాధికారిగా మాధవ్(కానిస్టేబుల్) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా మహేందర్‌రెడ్డి, సాయికిరణ్ జాదవ్, శంభు, గంగాధర్, పెర్సిస్, టీవీ.రమణను ఎన్నుకున్నారు. ఎస్పీ జానకీషర్మిల నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌ల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని నూతన కార్యవర్గానికి సూచించారు. కార్యక్రమంలో ఏవో యూనస్ అలీ, సీఐలు కృష్ణ, ప్రవీణ్, సాయికుమార్, గోవర్ధన్‌రెడ్డి, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, పాల్గొన్నారు.


