రామకృష్ణాపూర్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు భగత్‌సింగ్‌నగర్ ఏరియాకు చెందిన పిన్నింటి మహేందర్ (39) పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మెట్‌పల్లిలో మరొకరు..
భీమిని: కన్నెపల్లి మండలంలోని మెట్‌పల్లి గ్రామానికి చెందిన మంచర్ల భీమయ్య (56) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కన్నెపల్లి ఎస్సై విక్రమ్ తెలిపారు.


