రాష్ట్రస్థాయి పోటీల విజేత ఉమ్మడి ఆదిలాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల విజేత ఉమ్మడి ఆదిలాబాద్‌

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

మంచిర్యాలటౌన్‌: హైదరాబాద్‌లో జరుగుతున్న అండర్‌–16 రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు హీరాధి జట్టుపై విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో హీరాది జట్టు 45.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జట్టు కేవలం 35.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి విజేతగా నిలిచిందని ఉమ్మడి జిల్లా క్రికెట్‌ కార్యదర్శి కోదాటి ప్రదీప్‌, కోచ్‌ పోరండ్ల ప్రదీప్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్టు నుంచి పాల్గొన్న మాధవ త్రిశూల్‌ 91 బాల్స్‌లో 62 పరుగులు చేయగా, ఈ. శైలేష్‌ పది ఓవర్లలో 4 వికెట్లు తీసి 27 పరుగులు ఇచ్చి, జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. మొత్తం 12 మ్యాచ్‌లకు ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లను ఉమ్మడి జిల్లా జట్టు గెలుపొందినట్లు వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement