ఉట్నూర్‌రూరల్: కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గుంపుల విజయ్ తెలిపారు. ఉట్నూర్ మండలం గంగన్నపేటకు చెందిన సూర్యవంశీ గణేశ్ మే 11న రాత్రి మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. కొత్తగూడెం చెక్‌పోస్ట్ వైపు అధిక శబ్దంతో డీజే వినిపిస్తుండటంతో బ్లూకోల్ట్ నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఉట్నూర్ పోలీసులు సౌండ్ తగ్గించాలని సూచించారు. ఈ క్రమంలో డెకరేషన్ పని చేస్తున్న గణేశ్ మద్యం మత్తులో కానిస్టేబుల్ మడావి ప్రసాద్‌పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కోర్టు అనుమతితో నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.


