ఒప్పందాలు చూసి ఓర్వలేక విమర్శలు | - | Sakshi
Sakshi News home page

ఒప్పందాలు చూసి ఓర్వలేక విమర్శలు

Sep 1 2026 1:31 AM | Updated on Sep 1 2026 1:31 AM

ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య

శ్రీరాంపూర్‌: యాజమాన్యంతో ఆర్‌ఎల్‌సీ సమక్షంలో తాము చేసుకున్న మెరుగైన ఒప్పందాలు చూసి ఓర్వలేకనే టీబీజీకేఎస్‌ నాయకులు విమర్శలు చేస్తున్నారని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. సీసీసీ కార్నర్‌లోని నరసయ్య భవన్‌లో సోమవారం నిర్వహించి న కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 24 డి మాండ్లను చర్చల్లో సాధించామన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పెర్క్స్‌పై ఆదాయపన్ను చె ల్లింపు, హైదరాబాద్‌లో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, మెడికల్‌ బోర్డు నిర్వహణ, సొంతింటి పథకం వంటి వాటిపై చర్చల్లో కీలక ఒప్పందాలు చేసుకున్నామన్నారు. వారి గుర్తింపు సంఘం 11 ఏళ్లలో కార్మికులకు ఏ హక్కులు సాధించారో చెప్పాలని సవాల్‌ చేశారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు వీరభద్ర య్య, వైవీ రావు, ముస్కే సమ్మయ్య, మోత్కూరి కొ మురయ్య, బద్రి బుచ్చయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement