ఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. అల్పపీడనం ప్రభావంలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది.
కిశోర్‌కుమార్ సేవలు మరువలేనివి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాకు రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా కిశోర్‌కుమార్ అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ప్రతీ ఉద్యోగి జీవితంలో బదిలీ లు, పదవీ విరమణలు సహజమని పేర్కొన్నారు. కిశోర్‌కుమార్ వరంగల్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికా రి బాలిగ్ అహ్మద్, ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీ నరసింహమూర్తి ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కిశోర్‌కుమార్ రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా భూ సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోళ్లు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాల్లో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. వరంగల్ జిల్లాలోనూ ఇదే అంకితభావంతో పనిచేసి మంచి పేరు పొందాలని ఆకాంక్షించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా బాలిగ్ అహ్మద్, ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీగా నరసింహమూర్తి సుదీర్ఘకాలం క్రమశిక్షణతో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారన్నారు. విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
కిశోర్‌కుమార్‌ను సన్మానిస్తున్న కలెక్టర్ భవేశ్‌మిశ్రా


