ముథోల్: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళా కొనసాగుతోంది. విద్యార్థులు ప్రదర్శించిన గణిత, విజ్ఞాన, సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ నూతన ఆవిష్కరణలు, సృజనాత్మక నమూనాలను ప్రదర్శించారు. మేళాలో శిశువర్గ, బాలవర్గ, కిశోరవర్గకు చెందిన విద్యార్థుల సైన్స్, గణిత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంలోని 8 విభాగాల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు మేళాలో పాల్గొన్నారు. విద్యార్థులు తమ ప్రదర్శనల ఉద్దేశం, తయారీ విధానం, ఉపయోగాలు తదితర అంశాలను న్యాయ నిర్ణేతలకు వివరించారు. ముధోల్ ఎంఈవో గోపిడి రమణారెడ్డి మేళాను తిలకించారు. నిర్వాహకులు ఆయనను సన్మానించారు. అలాగే ప్రదర్శనలను పరిశీలించేందుకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల నుంచి వచ్చిన న్యాయ నిర్ణేతలను కూడా సన్మానించారు.


