ఆర్టీఐ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీఐ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌

Sep 1 2026 12:37 AM | Updated on Sep 1 2026 12:37 AM

నిర్మల్‌ఖిల్లా: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది జుట్టు చంద్రశేఖర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు ఏటి ఆంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగిండ్ల వెంకటేశ్‌తో కూడిన కార్యవర్గ సభ్యుల నిర్ణయం మేరకు చంద్రశేఖర్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రజలకు సహకరిస్తానని చంద్రశేఖర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement