నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026

న్యూస్‌రీల్‌

ఎల్‌నినోతో ఆలస్యమైన ఖరీఫ్‌ ఇటీవల భారీ వర్షాలతో నిండిన ప్రాజెక్టులు, చెరువులు చిగురించిన ఖరీఫ్‌ ఆశలు! వర్షంతో ‘సాగు’తున్న రైతులు

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పంద్రాగస్టు వేడుకల నిర్వహణపై సంబంధిత అధి కారులతో శుక్రవారం సమావేశం నిర్వహించా రు. ప్రోటోకాల్‌ ప్రకారం అతిథులను ఆహ్వా నించాలన్నారు. వేదికను అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులతో సాంస్కతిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అంబులెన్సు అందుబాటులో ఉంచడంతోపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్‌ ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో స్వాతంత్య్ర వేడుకలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, డీఆర్‌వో రాథోడ్‌ రమేశ్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, ఆర్డీవో దేవీదాస్‌ పాల్గొన్నారు.

భైంసా: ఎల్‌నినో ప్రభావంతో ఎప్పుడూ లేని విధంగా వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్న నిర్మల్‌ జి ల్లా రైతుల్లో తాజాగా కురుస్తున్న భారీ వర్షాలు ఖరీ ఫ్‌ ఆశలను చిగురింపజేశాయి. సీజన్‌ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో వరి సాగుపై రైతులు సందిగ్ధంలో పడ్డారు. నారుమడులు సిద్ధంగా ఉన్నప్పటికీ నీటి కొరత కారణంగా నాట్లు వేయకుండా వేచి చూశారు. అయితే పది రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రధాన ప్రాజెక్టులు, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఒక్కసారిగా జిల్లాలో వరి రైతుల ఆశలు చిగురించాయి.

జిల్లాలో సాగు ఇలా..

జిల్లాలో ఈ ఏడాది సుమారు 4 లక్షల ఎకరాల్లో వివి ధ పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇందులో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు సుమారు లక్ష ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొనసాగితే మరో వారం రోజుల్లో మరో 20 వేల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతోపాటే రైతులు సాగు పనులు విస్తరిస్తున్నారు. దీంతో వరి సాగు లక్ష్యానికి చేరువవుతోంది. వరి తర్వాత జిల్లాలో అత్యధికంగా 1.10 లక్షల ఎకరాల్లో సోయాబీన్‌, 1.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కొనసాగుతోంది. అలాగే 20 వేల ఎకరాల్లో పెసర, 10 వేల ఎకరాల్లో పసుపు, 20 వేల ఎకరాల్లో కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుత వర్షాలు అనుకూలంగా ఉండటంతో అన్ని పంటలు మంచి ఎదుగుదల దశలోకి ఉన్నాయని రైతులు చెబుతున్నారు.

నిండిన ప్రాజెక్టులు, చెరువులు..

ఎస్సారెస్పీ, గడ్డెన్నవాగు, స్వర్ణ, కడెం ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని ప్రధాన చెరువులు నీటితో నిండిపోవడం రైతులకు ఊరటనిచ్చింది. భూగర్భ జలాలు పెరగడంతో బోరుబావుల కింద సైతం వరి సాగు ఊపందుకుంది. వరి సాగుకు నీటి కొరత ఉండదనే నమ్మకం రైతుల్లో పెరిగింది. గతంలో వర్షాభావంతో ఎదురైన ఇబ్బందులు ఈసారి ఉండవని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

లోకేశ్వరం: గొడిసెరాలో వరి నారు తీసున్న మహిళా కూలీలు

వర్షాలతో సాగు వేగం..

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడంతో వరి సాగు కూడా కొంత ఆలస్యమైంది. మరో వారం రోజుల్లో ఎక్కువ భాగం నాట్లు పూర్తవుతాయి. ప్రాజెక్టుల్లోనూ వర్షాలతో నీరు చేరింది. రైతులు అధిక దిగుబడుల కోసం వ్యవసాయ శాఖ సూచించే యాజమాన్య పద్ధతులను పాటించాలి. అవసరమైన ఎరువులు, విత్తనాలు జిల్లాలో తగినంత అందుబాటులో ఉన్నాయి.

– అంజిప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అధికారి

జిల్లాలో కురిసిన వర్షపాతం

(జూన్‌ 1 నుంచి ఆగస్టు 7 వరకు)

సాధారణ వర్షపాతం 545.4 మి.మీలు

నమోదైన వర్షపాతం 563.5 మి.మీలు

వ్యత్యాసం +3.3 శాతం అధికం

వరి నాట్లు ప్రారంభించాం

ఈసారి మొదట వర్షాలు లేక చాలా ఆందోళన పడ్డాం. నారుమడులు సిద్ధంగా ఉన్నా నీరు లేక నాట్లు వేయలేకపోయాం. ఇప్పుడు భారీ వర్షాలు కురవడంతో చెరువులు నిండాయి. పొలాల్లో నీరు పుష్కలంగా ఉంది. వేగంగా నాట్లు వేస్తున్నాం. వర్షాలు ఇలాగే కొనసాగితే మంచి దిగుబడి వస్తుంది.

– మల్లేశ్‌, రైతు, భైంసా

జోరుగా వరినాట్లు

ఖరీఫ్‌ ప్రారంభంలో వాతావరణ శాఖ తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో పలువురు రైతులు వరి సాగును తగ్గించాలని భావించారు. కొందరు ప్రత్యామ్నాయంగా సోయాబీన్‌, పత్తి వైపు మొగ్గు చూపారు. అయితే జూలై చివరి వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు వ్యవసాయ పరిస్థితులను పూర్తిగా మార్చేశాయి. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరగడంతో వరి సాగుపై రైతులు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. నారుమడులు సిద్ధంగా ఉండడంతో ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, నాట్ల యంత్రాలు, కూలీలతో పొలాలన్నీ సందడిగా మారాయి.

అధిక వర్షపాతం నమోదైన మండలాలు:

కుభీర్‌ +38% కడెంపెద్దూర్‌ +34%

నిర్మల్‌ అర్బన్‌ +27% మామడ +20%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement