ఏకరూపం..ఆలస్యం! | - | Sakshi
Sakshi News home page

ఏకరూపం..ఆలస్యం!

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

● పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు ● ఇప్పటికీ పూర్తిస్థాయిలో రాని క్లాత్‌ ● పాత దుస్తులతోనే పంద్రాగస్టు పండుగ

లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు పాఠశాలలు ప్రా రంభమయ్యే రోజునే పాఠ్యపుస్తకాలు, యూని ఫాం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాఠ్యపుస్తకాలు ప్రారంభ రోజునే అందజేసినప్పటికీ, యూని ఫాం ఇప్పటివరకు అందజేయలేదు.

వచ్చిందిన సగం క్లాతే..

నూతన విద్యా సంవత్సరం 2026–27 ప్రారంభమై రెండు నెలలు గడిచినా, విద్యార్థులకు అందజేయాల్సిన యూనిఫాం ఇంకా ఇవ్వలేదు. 1 నుంచి 10వ తరగతి వరకు అబ్బాయిలకు షర్ట్‌ క్లాత్‌, 6 నుంచి 12వ తరగతి వరకు బాలికలకు టాప్‌, బాటమ్‌ క్లా త్‌ వచ్చాయని, వాటిని స్వయం సహాయక సంఘా ల మహిళలకు ఇచ్చి కుట్టిస్తున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే 1 నుంచి 12వ తరగతి వరకు అబ్బాయిలకు బాటమ్‌ క్లాత్‌, 1 నుంచి 5వ తరగతి వరకు అమ్మాయిలకు టాప్‌, బాటమ్‌ క్లాత్‌ ఇంకా రావాల్సి ఉందని చెబుతున్నారు.

కేజీబీవీ విద్యార్థులకు..

జిల్లాలోని 18 కేజీబీవీల్లో మొత్తం 6,400 మంది వి ద్యార్థులున్నారు. వీరిలో ఇప్పటికే 6 వేల మంది బాలికలకు రెండు జతల ఏకరూప దుస్తులు కుట్టించడం పూర్తయింది. మిగిలిన 400 మంది బాలికలకు త్వరలోనే కుట్టించడం పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్‌తో కలిపి మొత్తం 746 పాఠశాలలున్నాయి. వీటిలో 48,148 మంది విద్యార్థులు చదువుతున్నారు. కేజీబీవీ పోను.. 42,148 మంది విద్యార్థులకు సరిపడా క్లాత్‌ సరఫరా కాకపోవడంతో కుట్టించడం పూర్తి కాలేదని అధికారులు వెల్లడించారు. క్లాత్‌ వచ్చిన వెంటనే కుట్టించి విద్యార్థులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

ఆగస్టు 15 వేడుకలకు పాత బట్టలే..

మరో వారం రోజుల్లో స్వాతంత్య్ర దినోత్స వం జరుగనుంది. సాధారణంగా ఆ రోజు వి ద్యార్థులు నూతన ఏకరూప దుస్తులు ధరించి హాజరవుతుంటారు. ఈసారి కేజీబీవీలు, మై నార్టీ పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్‌, ఎంజేపీ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15లోపు నూతన ఏకరూప దుస్తులు అందజేసేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపడుతున్నారు. మిగిలిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఈసారి పాత దుస్తులతోనే వేడుకలకు హాజరుకానున్నారు.

త్వరలో అందించేలా..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల కోసం వచ్చిన క్లాత్‌ ఇది వరకే స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించి స్టిచ్చింగ్‌ చేయిస్తున్నాం. కేజీబీవీల విద్యార్థుల స్టిచ్చింగ్‌ పూర్తి కాగా మిగిలిన విద్యార్థులకు సరిపడా క్లాత్‌ రాలేదు. రాగానే స్టిచ్చింగ్‌ చేయించి అందిస్తాం.

– భోజన్న, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement