నిర్మల్‌టౌన్: గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివా రం ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని పెన్షన ర్స్ భవన్‌లో నిర్వహించిన ఎన్నికల్లో 2026 –28 కాలానికి జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నర్సాపూర్ ఎంఈఓ వై.సాయన్న, ప్రధాన కార్యదర్శిగా కుభీర్ ఎంఈవో విజయ్‌కుమార్, కోశాధికారిగా బోసి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయు డు రాజశేఖర్ ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర కౌన్సిలర్లుగా బాసర ఎంఈవో మైసాజి, సారంగాపూర్ గెజిటెడ్ హెచ్‌ఎం కె.విజయ ఎన్నికయ్యారు. రాష్ట్ర బాధ్యులు తుకారం ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.


