ఉప సర్పంచులపై ఆరోపణలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఉప సర్పంచులపై ఆరోపణలు సరికాదు

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

కడెం: జీతం లేకుండా గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న ఉప సర్పంచులపై ఆరోపణలు మానుకోవాలని, ఉప సర్పంచులు ఏడు రోజుల్లో సంతకాలు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి సంపత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం మాట్లాడారు. సంతకాలు చేసే ముందు పూర్తి ఆధారాలు, ఖర్చుల వివరా లు పరిశీలించి చేస్తామన్నారు. తక్కువ ఖర్చుతో పనులకు ఎక్కువ బిల్లుల చూపిస్తూ బిల్లులు తయారు చేసి సంతకాలు కోసం ఒత్తిడి చేస్తే ఉప సర్పంచులు సంతకాలు చేయరని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే సంబంధిత ఆధారాలతో కలెక్టర్‌ కు ఫిర్యాదు చేస్తామన్నారు. నిబంధనలు ఉల్ల ఘించిన ఉప సర్పంచులకు తాము మద్దతు ఇవ్వమని తెలిపారు. ఇందులో ఉప సర్పంచుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె మధుకర్‌, మండల అధ్యక్షులు బండారి జనార్దన్‌, యాదగిరి, రెంకల విజయ్‌, శ్రీను, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement