సామాజిక సాధికారతకు చేయూత | - | Sakshi
Sakshi News home page

సామాజిక సాధికారతకు చేయూత

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

● ఎస్సీలకు స్వయం ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలు ● జిల్లాలో ఆరు గ్రామాలు ఎంపిక.. సర్వే

సారంగపూర్‌: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి న షెడ్యూల్డు కులాల అభివృద్ధికి కేంద్రం చేయూత అందిస్తోంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధి కారత మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రధానమంత్రి అనుసూచిత్‌ జాతి అభ్యుదయ యోజన అమలుకు కసరత్తు ప్రారంభించింది. దీని కోసం ఇప్పటికే జిల్లాలోని ఐదు మండలాల పరిధి లోని ఆరు గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన గ్రామాల్లో ఎంపీడీవోల సమక్షంలో సర్వే పనులను షురూ చేశారు.

జానాభా ప్రాతిపదికన ఎంపిక...

40 శాతంపైగా ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను ఈ పథకానికి ఎంపిక చేశారు. జిల్లాలో సోన్‌ మండలం సంగంపేట్‌, లోకేశ్వరం మండలం సాత్‌గాం, గడ్‌చాంద, బాసర మండలం దోడాపూర్‌, తానూరు మండలం ఎల్వత్‌, సారంగాపూర్‌ మండలం కంకెట గ్రామాలు ఎంపికయ్యాయి. ఆయా గ్రామాల్లో ఎంపీడీవోలకు కలెక్టర్‌ ప్రొసీడింగ్‌ కాపీలను అందజేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరతను(తాగునీరు, విద్యుత్‌, రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు) భర్తీ చేయడానికి గ్రామానికి రూ.21 లక్షల చొప్పున కేటాయించనున్నారు.

ఆదాయ పెంపు, నైపుణ్యాభివృద్ధి...

నిరుపేద ఎస్సీ కుటుంబాలు ఉపాధి పొందేందుకు, లేదా సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రూ.10 వేలు రాయితీపై కేంద్రం అందిస్తుంది. అర్హులైన ఎస్సీ యువతకు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ప్రవేశపెడతారు. ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకునే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వసతిగృహాల నిర్మాణం, ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లకు మరమ్మతులు చేపట్టనుంది. దీనికోసం వ్యక్తిగత లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇటీవలే సర్క్యులర్‌ జారీ చేశారు..

పీఎం అజయ్‌ పథకానికి సంబంధించి ఇటీవలే కలెక్టర్‌ కార్యాలయం నుంచి ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. అందుకే 40 శాతానికిపైగా ఎస్సీ జనాభా ఉన్న గ్రామాల్లో వారి జీవన స్థితిగతులు, వారి కుటుంబాల్లో విద్యావంతులు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వారి ప్రధాన వృత్తి వివరాలు, తదితరాలపై సర్వే ప్రారంభించాం. సర్వే పూర్తి కాగానే కలెక్టర్‌కు రిపోర్టును అందజేస్తాం.

– లక్ష్మీకాంత్‌రావు, ఎంపీడీవో, సారంగాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement