భైంసాటౌన్: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పి.రామారా వు పటేల్ అన్నారు. పట్టణంలోని తన నివా సంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 129 మందికి మంజూరైన రూ. 36.13 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. నియోజకవర్గంలో బాధితులకు సహాయం కోసం తన కార్యాలయంలో ప్రత్యే క విభాగం అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూముల దత్తాత్రి, నాయకులు భీంరావ్, పండిత్‌రావ్, బీజేపీ పట్టణ, మండలాధ్యక్షులు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.


