సాగునీటిని శాసీ్త్రయంగా వాడాలి | - | Sakshi
Sakshi News home page

సాగునీటిని శాసీ్త్రయంగా వాడాలి

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

● పంట మార్పిడి విధానాలతో నష్టం ఉండదు ● రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీ టిని అవసరాలకు అనుగుణంగా శాసీ్త్రయంగా విని యోగించేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటవీ, పర్యావరణ శా ఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రస్తు త వాతావరణ పరిస్థితులు, వన మహోత్సవం, స్మా ర్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ, వ్యవసాయరంగం, నీటి వినియోగం తదితర అంశాలపై సీఎస్‌ సంజయ్‌ జా జుతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

పంట మార్పిడితో అధిక ఆదాయం..

పంట మార్పిడి విధానాల అమలు ద్వారా రైతులు నష్టాలను నివారించడంతోపాటు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతులకు పంటల వైవిధ్యంపై అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన పంట కుంటల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

ఇరిగేషన్‌ అడ్వైజరీ సమావేశం నిర్వహించాలి..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాగు ప్రణాళికలపై స్పష్టమైన సమాచారం అందించేందుకు గ్రామ స్థాయిలో ఇరిగేషన్‌ అడ్వైజరీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు విస్తతంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. అనంతరం జిల్లాల వారీగా వర్షపాతం, పంటల సాగు, నీటి లభ్యత తదితర అంశాలను సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ భవిశ్‌ మిశ్రా, అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, డీఎఫ్‌వో సుశాంత్‌ సుఖదేవ్‌ బోబడే, డీఆర్‌వో రాథోడ్‌ రమేశ్‌, డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీఎస్‌వో రాజేందర్‌, డీఈవో భోజన్న, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్‌, ఉద్యానవన శాఖ అధికారి రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement