కడెం: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు రాములునాయక్, కేవీఎన్.రెడ్డి, భవానిరెడ్డి, సునీల్‌కుమార్, గంగాధర్‌తో కలిసి గురువారం రాత్రి మండల కేంద్రంలోని బృందావన్ రిసార్ట్స్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం కడెం ప్రాజెక్టును సందర్శించారు. నీటిమట్టం, ఆయకట్టు వివరాలు తెలుసుకున్నారు. బ్యాక్ వాటర్‌ను పరిశీలించా రు. కార్యక్రమంలో తహసీల్దార్ ఖాజా మెయినుద్దీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


