నిర్మల్‌ఖిల్లా: ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్య ల పరిష్కారమే ప్రధాన ద్యేయంగా సంఘం నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు చేస్తోందని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్ అన్నా రు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) ఆవిర్భావ వేడుకలను శుక్రవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. సంఘం ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంఘం నాయకులు, సభ్యులు జెండా ఆవిష్కరించి నినాదాలు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో, స్వర్గీయ స్వామిరెడ్డిసార్ నాయకత్వంలో టీయూటీఎఫ్ ఆవిర్భవించిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలు విడుదల చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం పూర్తిస్థాయిలో అమలు చేయడంతోపాటు, పథకంలో పేర్కొన్న అన్ని ఆస్పత్రుల్లో ఉద్యోగులకు చికిత్స అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షుడు ఏ.లక్ష్మీప్రసాద్‌రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు వట్టోలి ముత్తన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి వహీద్‌ఖాన్, కోశాధికారి మేడారపు శ్రీనివాస్, ఖానాపూర్ మండల అధ్యక్షులు పాండురంగాచారి, సారంగాపూర్ మండల అధ్యక్షులు మొయిజుద్దీన్ పాల్గొన్నారు.


