డీఆర్వో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

డీఆర్వో తనిఖీలు

Jul 18 2026 12:06 AM | Updated on Jul 18 2026 12:06 AM

దిలావర్‌పూర్‌: మండలంలోని పలు గ్రామాల్లో మండల ప్రత్యేక అధికారి, డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, ఎంపీవో గోవర్ధన్‌ శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎంపీవో గోవర్ధన్‌ మాయాపూర్‌ పంచాయతీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్‌, నర్సరీలను తనిఖీ చేశారు. అలాగే స్థానిక ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థుల హాజరును, అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, ఎంపీవో గోవర్ధన్‌తో కలిసి గుండంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, కిచెన్‌ గార్డెన్‌, ఆర్‌ఓ ప్లాంట్‌, మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఆర్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement