ఏఐని సమర్థవంతంగా వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

ఏఐని సమర్థవంతంగా వినియోగించాలి

Jul 18 2026 12:06 AM | Updated on Jul 18 2026 12:06 AM

నిర్మల్‌టౌన్‌: ప్రతీ దర్యాప్తు అధికారి సీసీటీఎన్‌ఎస్‌ ఏఐ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించి కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, దర్యాప్తు అధికారులు, సిబ్బందితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తును మరింత వేగవంతంగా, నాణ్యంగా నిర్వహించేందుకు కృత్రిమ మేధస్సు(ఏఐ) ఆధారిత సీసీటీఎన్‌ఎస్‌–ఏఐ పైలట్‌ ప్రాజెక్టును సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. అలాగే సీసీటీఎన్‌ఎస్‌తో కేసుల దర్యాప్తునకు అవసరమైన సమాచారం, చట్టపరమైన అంశాలు, కేసు విశ్లేషణ, డిజిటల్‌ ఆధారాల పరిశీలన వంటి అంశాల్లో దర్యాప్తు అధికారులకు సాంకేతిక సహకారం లభిస్తుందని తెలిపారు. శాసీ్త్రయ విధానాలతో, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించి, కన్విక్షన్‌ రేటు పెంచడమే ఈ పైలట్‌ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దర్యాప్తులో నిర్లక్ష్యానికి తావు లేకుండా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement