క్రీడాకారులకు సువర్ణావకాశం | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు సువర్ణావకాశం

Jul 18 2026 12:06 AM | Updated on Jul 18 2026 12:06 AM

● స్పోర్ట్స్‌ అకాడమీల్లో ప్రవేశాలకు ఆహ్వానం ● ఈనెల 20 నుంచి ఎంపిక పోటీలు

నిర్మల్‌టౌన్‌: క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరాలనుకునే యువ క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. 2026–27 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ స్పోర్ట్స్‌ అకాడమీలు, ప్రాంతీయ క్రీడా వసతిగృహాల్లో ప్రవేశాల కోసం ఈ నెల 20నుంచి 28వరకు ఎంపిక పోటీలు నిర్వహించనుంది. జిల్లాలోని అర్హులైన బాలబాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్మల్‌ జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి బి.శ్రీకాంత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌, ఖమ్మం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్‌, హనుమకొండ, వనపర్తి లాంటి కేంద్రాల్లో సైక్లింగ్‌, రెజ్లింగ్‌, హాకీ, అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, ఫుట్‌బా ల్‌, జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌, కబడ్డీ తదితర క్రీడల్లో ఎంపిక పోటీలు ని ర్వహించనున్నారు. ఆయా క్రీడల కు నిర్ణయించిన తేదీల్లో సంబంధిత కేంద్రాలకు నే రుగా హాజరుకావాలని అధికారులు సూచించారు.

ఎంపిక విధానం, వయోపరిమితి

ఎంపిక పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వయస్సు నిర్ధారణతో పాటు శారీరక దారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి గత ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌ విభాగాలకు 10–12 ఏళ్ల మధ్య, సరూర్‌నగర్‌ వాలీబాల్‌ అకాడమీకి 16–18 ఏళ్ల మధ్య, మిగతా అన్ని క్రీడలకు 14–16 ఏళ్లలోపు వయస్సు గల క్రీడాకారులు అర్హులు.

తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు

ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు పాఠశా ల లేదా కళాశాల బోనఫైడ్‌, వయస్సు ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమో, ఆధార్‌ కార్డు లేదా నివాస ధ్రువీకరణ పత్రం, 10 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో ఎంపిక కేంద్రాలకు హాజరుకావాలని అఽ దికారులు తెలిపారు. పూర్తి వివరాలకు నిర్మల్‌ జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

తేదీ క్రీడ బాలురు/బాలికలు వేదిక

జూలై 20 సైక్లింగ్‌, రెజ్లింగ్‌ బాలురు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌

జూలై 20, 21 హాకీ, అథ్లెటిక్స్‌ బాలురు, బాలికలు గచ్చిబౌలి అకాడమీ, హైదరాబాద్‌

జూలై 20, 21 వాలీబాల్‌ బాలురు, బాలికలు సరూర్‌నగర్‌ వాలీబాల్‌ అకాడమీ

జూలై 20, 21 హాకీ బాలురు వనపర్తి అకాడమీ

జూలై 20, 21 హ్యాండ్‌బాల్‌, ఫుట్‌బాల్‌ బాలురు ఎల్‌బీ స్టేడియం, హైదరాబాద్‌

జూలై 21 అథ్లెటిక్స్‌ బాలురు ఖమ్మం అకాడమీ

జూలై 22, 23 వాలీబాల్‌ బాలురు, బాలికలు సిద్దిపేట అకాడమీ

జూలై 22, 23 వాలీబాల్‌ బాలురు సిరిసిల్ల అకాడమీ

జూలై 25, 26 వాలీబాల్‌ బాలురు, బాలికలు మహబూబ్‌నగర్‌ అకాడమీ

జూలై 25, 26 కబడ్డీ బాలురు మహబూబ్‌నగర్‌ అకాడమీ

జూలై 27, 28 జిమ్నాస్టిక్స్‌, అథ్లెటిక్స్‌ బాలురు, బాలికలు హనుమకొండ ప్రాంతీయ క్రీడా వసతిగృహం

జూలై 27, 28 స్విమ్మింగ్‌, హ్యాండ్‌బాల్‌, రెజ్లింగ్‌ బాలురు హనుమకొండ ప్రాంతీయ క్రీడా వసతిగృహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement