ఆషాఢ మాసం నేపథ్యంలో నిర్మల్ పట్టణంలో బోనాల వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక ఆదర్శనగర్ కాలనీలో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. యువతులు కూడా భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఊరేగింపులో శివసత్తులు పూనకాలు, పోతురాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జోగినులు అమ్మవారి నామస్మరణతో సంప్రదాయ నృత్యం చేశారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. – నిర్మల్‌టౌన్


