గుర్రపు డెక్క.. యమ డేంజర్‌ | - | Sakshi
Sakshi News home page

గుర్రపు డెక్క.. యమ డేంజర్‌

Jan 10 2026 9:30 AM | Updated on Jan 10 2026 9:30 AM

గుర్ర

గుర్రపు డెక్క.. యమ డేంజర్‌

● నిర్మల్‌ చెరువుల్లో కుప్పలు తెప్పలు.. ● తొలగింపులో అధికారుల నిర్లక్ష్యం ● మత్స్యకారులకూ తప్పని పాట్లు

నిర్మల్‌టౌన్‌: చెరువుల్లో గుర్రపు డెక్క ప్రాణాంతకంగా మారుతోంది. జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్‌, కూరన్నపేట్‌, బంగల్‌పేట్‌, కదం చెరువులు గుర్రపు డెక్కతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో పట్టణ శివారులోని చెరువుల్లోని నీటిని పశువులు కూడా తాగలేకపోతున్నాయి. గుర్రపుడెక్క కారణంగా చెరువుల పరిసరాలన్నీ దుర్గంధంగా మారుతున్నాయి. దోమలు, క్రిమి కీటకాలు పెరుగుతున్నాయి. స్థాని కులు కాలుష్యవ్యాప్తితో ఆందోళన చెందుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం..

గుర్రపు డెక్క వల్ల దోమలు పెరిగి మలేరియా, డెంగీ వ్యాధులు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కూరన్నపేట్‌ చెరువులో గురువారం సాయంత్రం నీళ్లు తాగేందుకు దిగిన 70 గేదెలు గుర్రపు డెక్కలో చిక్కుకుని బయటకు రాలేక ఇబ్బంది పడ్డాయి. కాపరులు, యజమానులు శ్రమించి కష్టంగా బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే 9 గేదెలు ఊపిరాడక మృతిచెందాయి. ఇప్పటికై నా అధికారులు చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

డ్రైనేజీ నీటి ప్రభావంతో..

పట్టణంలోని డ్రైనేజీ నీరు చెరువుల్లోకి పోతుండటంతో గుర్రపు డెక్క పెరుగుతోంది. నీటి నాణ్యత తగ్గడంతో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతున్నాయి. చేపలు, జలజీవులు చనిపోతున్నాయి. చేపల పెంపకం, వేట కష్టమవుతోంది. నీటి సరఫరా ఆగిపోతోంది. గుర్రపు డెక్క మత్స్యకారులకు కూడా అడ్డంకిగా మారింది. చేపలు పట్టడం కష్టం అవతుందని పేర్కొంటున్నారు.

గేదెల మృతిపై విచారణ..

నిర్మల్‌టౌన్‌ : కురన్నపేట్‌ చెరువు గుర్రపు డెక్కలో చిక్కుకుని గేదెలు మృతిచెందిన ఘటనపై ఆర్‌ఐ వెంకటరమణ శుక్రవారం విచారణ చేపట్టారు. చెరువు వద్దకు వచ్చిన గేదెల యజమానులతో మాట్లాడారు. మొత్తం 9 గేదెలు మృతిచెందినట్లు తెలిపా రు. గడ్డం శంకర్‌కు చెందిన రూ.1.40 లక్షల విలువ చేసే రెండు గేదెలు, ఆకుల లక్ష్మణ్‌కు చెందిన రూ.55 వేల విలువైన గేదె, రమేష్‌ చెందిన రూ.2.40 లక్షల విలువ చేసే మూడు గేదెలు, కుంటాల రాజుకు చెందిన రూ.55 వేల విలువ చేసే గేదెలు, కుమ్మరి పోశెట్టికి చెందిన రూ.60 వేల విలువ చేసే గేదె, శంకర్‌కు చెందిన రూ.70 వేల విలువ చేసే గేదె మృతిచెందినట్లు తెలిపారు. ఈమేరకు ఆర్‌ఐ పంచనామా చేశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

డ్రైనేజీ నీటితోనే ప్రమాదం

డ్రైనేజీ నీరు చెరువుల్లోకి వదలడంతో జిల్లా కేంద్రంలోని చెరువులు ప్రమాదకరంగా మారాయి. డ్రైనేజీలు చెరువులో కలవకుండా మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి. గుర్రపు డెక్క పెరగడానికి కూడా ఈ డ్రైనేజీ నీరే కారణం. దీంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నీటిలో ఆక్సిజన్‌ పడిపోతోంది. – అనిల్‌, ఇరిగేషన్‌ ఈఈ

గుర్రపు డెక్క.. యమ డేంజర్‌1
1/1

గుర్రపు డెక్క.. యమ డేంజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement