కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
భైంసాటౌన్: గ్రామ పంచాయతీలకు వచ్చే అధిక శాతం నిధులు కేంద్రానివేనని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎస్‌ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఈటల, ఏలేటి హాజరై మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీ ఎన్నికలు నిర్వహించారని తెలిపా రు. అయితే 20 రోజులు కావస్తున్నా సర్పంచులకు చెక్ పవర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్ని కల హామీలు నెరవేర్చకుండా గారడీ మాటలతో కాలం వెల్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఏ రాష్ట్రంలోనైనా ఒక్కసారి అధికారంలోకి వస్తే వరుసగా 25ఏళ్లపాటు అధికారంలో ఉన్న చరిత్ర ఉందన్నారు. ముధోల్ నియోజకర్గంలో 103 సర్పంచ్ స్థానాలు ఏకపక్షంగా కై వసం చేసుకుందన్నారు. బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతరం సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. కార్యక్రమానికి ముందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్ సర్దా మృతికి సంతాపంగా మౌనం పాటించారు.


