మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి
కడెం: మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఎ మ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. కడెం ప్రా జెక్టులో శుక్రవారం చేప పిల్లలు విడుదల చేశా రు. ప్రాజెక్టులు, చెరువుల్లో ఉచిత చేప పిల్లల విడుదల చేస్తూ, మత్స్యకారులకు సబ్సిడీ వా హనాలు అందిస్తూ వారి సంక్షేమానికి రాష్ట్ర ప్ర భుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం మండల కేంద్రంలో సీఎం కప్ ర్యాలీని ప్రారంభించారు. ఇందులో ఏఎంసీ చైర్మన్ భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సునీత, ఫిషరీస్ ఏడీ రాజనర్సయ్య, ఎఫ్‌డీవో విజయ్‌కిరణ్, స ర్పంచులు దీకొండ విజయ్, తిరుపతి, భీమేశ్, లక్ష్మి, ఎంఈవో షేక్‌హుస్సేన్, హెచ్‌ఎం శ్రీనివా స్‌రెడ్డి, పీడీ వెంకటరమణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు.


